విశ్వాంతరాళాన్ని చుట్టిన సునీత
సునీత విలియమ్స్....
ఈ పేరు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.మరింకెంతోమందికి మార్గదర్శకం..
అంతేకాదు... భారత దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన ఘనత కూడా మన భారత జాతి సంతతికి చెందిన సునీతకే దక్కడం భారతీయులమైన మనందరికి గర్వకారణం. మహిళలు అన్ని రంగాలలో రాణించగలరని మన సునీత నిరూపించారు. అత్యధిక దినాలు అంతరిక్షంలో గడిపిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. నాసా రూపొందించిన అంతరిక్ష నౌక డిస్కవరీలో 2006 డిశంబర్ 11న కేప్ కేన్వరాల్‌లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకెళ్ళిన సునీత ఆరు నెలలకు పైగా అంతరిక్షంలోనే గడిపి అనేక మార్లు స్పేస్‌వాక్ చేశారు. ఇలా అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మహిళల్లో సునీత రెండవ మహిళ. అంతకుముందు అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన ఘనత జన్మతః భారతీయురాలైన కల్పనా చావ్లాకు దక్కింది. కల్పన, సునీతలు మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి సైక్లింగ్ కూడా చేసేవారు.
గుజరాత్‌కు చెందిన డాక్టర్ దీపక్ పాండ్యా, యుగోస్లావియాకు చెందిన బోనీ దంపతులకు సునీత 1965 సెప్టెంబర్ 19న ఓహియోలో జన్మించారు. 1983లో మసక్కుచెట్స్‌లోని నీధం హైస్కూల్‌లో సునీత విద్యాభ్యాసం ప్రారంభమయ్యింది. ఆ తరువాత 1987లో అమెరికా నావల్ అకాడమీ నుంచి బి.ఎస్. ఫిజికల్ సైన్స్‌లో డిగ్రీ పొందారు. 1995లో ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్.లో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ పూర్తిచేశారు. అనంతరం మైఖేల్ జె. విలియమ్స్ ను పెళ్ళిచేసుకున్నారు. వారికి సంతానం లేదు. తన పెంపుడు కుక్క గోర్బి అంటే సునీతకు ఎంతో ఇష్టం.
సునీతకు భారత దేశం పట్ల అమిత గౌరవం ఉంది. ఆమె నరనరాల్లో దేశభక్తి జీర్ణించుకుపోయింది. కేవలం తన తండ్రి మాత్రమే భారతదేశానికి చెందినవారు అయినప్పటికీ సునీత ఎప్పుడూ భారతదేశ కట్టుబాట్లను, సాంప్రదాయాలను పాటించడానికే ఇష్టపడతారు. స్పేస్‌వాక్ చేయడానికి పొడవాటి జుట్టు అడ్డుగా ఉంటుంది కనుక జుట్టు పొట్టిగా కత్తిరించాలని అధికారులు చెప్పినప్పటికీ ఏ మాత్రం ఒప్పుకోలేదట.
సునీత తన తండ్రితో ఎప్పుడూ ఇండియా గురించే మాట్లాడుతారు. సునీతకు భారతదేశం పట్ల ఎంత భక్తి ఉందంటే.. అంతరిక్షంలోకి ఆమె తనతోపాటుగా సమోసాలు, భగవద్గీత, వినాయకుని విగ్రహం, తండ్రి రాసిన ఉత్తరం కూడా తీసుకుని వెళ్ళారు. సునీత ఓహియాలో పుట్టి పెరిగినప్పటికీ, హిందూ దేవుళ్ళను ఎప్పుడూ పూజిస్తుంటారు. ముఖ్యంగా వినాయకుడు అంటే సునీతకు చాలా ఇష్టం. అలాగే భగవద్గీత ఎప్పుడూ చదువుతుంటారు. భగవద్గీత చదవడం వలన భయంపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుందనేది సునీత అభిప్రాయం. ఇక వంటల విషయానికొస్తే, మన భారతీయ వంటలు అంటే ఆమేకు ఎంతో ఇష్టం. సమోసాలంటే మరీ ఇష్టం.